Advertisementt

ప్రభాస్-హను కాంబో: క్లాస్ తో కూడిన మాస్

Tue 30th Jul 2024 07:16 PM
prabhas  ప్రభాస్-హను కాంబో: క్లాస్ తో కూడిన మాస్
Prabhas-Hanu Raghavapudi movie update ప్రభాస్-హను కాంబో: క్లాస్ తో కూడిన మాస్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాస్ మాస్ అంటూ వరసగా మాస్ సినిమాలే చేస్తూ వస్తున్నారు. బాహుబలి తర్వాత సాహో పక్కా మాస్ కమర్షియల్ మూవీ, ఆ తర్వాత రాధేశ్యామ్ లవ్ స్టోరీని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఆదిపురుష్ సంగతి సరేసరి. ఆ తర్వాత సలార్ తో ఫుల్ మాస్ సినిమా చేసిన ప్రభాస్ కి సక్సెస్ స్టార్ట్ అయ్యింది. కల్కి 2898 AD అది కంటిన్యూ అయ్యింది.

ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ హర్రర్ కామెడీ జోనర్. ప్రభాస్ లుక్ కూడా చాలా జోవియల్ గా ఉండడం ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు రెడీ అవుతుంది. ప్రభాస్ తదుపరి చిత్రాలైన సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఇవన్నీ మాస్ జోనర్ అనే విషయం తెలిసిందే.

అయితే ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో సెప్టెంబర్లో మొదలు కాబోయే భారీ పాన్ ఇండియా చిత్రం యుద్ధ నేపధ్యానికి లవ్ స్టోరీ టచ్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అంటే సీతారామం మాదిరే ఫూర్ లవ్ స్టోరీలా ప్రభాస్-హను కాంబో మూవీ ఉంటుంది అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్-హను రాఘవపూడి ల సినిమా ప్యూర్ క్లాస్ జోనర్ కి కాస్త మాస్ టచ్ కూడా ఇవ్వబోతున్నారట. మరి ఈసారి ప్రభాస్ ని మాస్ గానే కాదు రొమాంటిక్ యాంగిల్లో కూడా ఫ్యాన్స్ చూచోడబోతున్నారన్నమాట. 

Prabhas-Hanu Raghavapudi movie update :

Prabhas To Play a Soldier in Hanu Raghavapudi movie

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ