ఈమధ్యన సమంత మాయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకుంది. మాయోసైటిస్ వలన సినిమా షూటింగ్స్ కి కూడా సమంత బ్రేకిచ్చింది. ప్రస్తుతం సమంత కోలుకుని తిరిగి సినిమా షూటింగ్స్ కి హాజరు కాబోతుంది. అయితే అటు మాయోసైటిస్ నుంచి కోలుకుంటూనే ఆరోగ్యకరమైన టిప్స్ ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంది. ఈమధ్యన సమంత షేర్ చేసిన ఓ టిప్ పై ఓ డాక్టర్ సమంత పై ఫైర్ అయ్యాడు. ఆమె తప్పుడు సమాచారమిస్తూ తన ఫాలోవర్స్ ని తప్పు దారి పట్టిస్తుంది.. సమంత ని చంపేయ్యాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసినా.. ఆ విషయంలో సమంత వెనక్కి తగ్గలేదు.
ఇపుడు మరో హీరోయిన్ నయనతార విషయంలోనూ అదే జరిగింది. నయనతార తన ఇన్స్టా లో చాయ్ గురించి చేసిన ఓ పోస్ట్ పై దుమారం చెలరేగింది. మందార పువ్వు వేసిన టీ తాగడం వలన ఆరోగ్యానికి ఏంతో మంచిదని, దీని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బిపి ఉన్నవారికి ఈ టీ వలన ఉపశమనం కలుగుతుంది అంటూ నయనతార చేసిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారడమే కాదు.. తీవ్ర చర్చలకు దారితీసింది.
నయనతార పోస్ట్ చూసి ఓ డాక్టర్ ట్విట్టర్ X వేదికగా.. నయనతార చెప్పిన దానిలో ఎలాంటి నిజం లేదు, ఆమె తన ఫాలోవర్స్ ని తప్పుదారి పట్టిస్తుంది అంటూ విమర్శించాడు. ఆ డాక్టర్ ట్వీట్ వైరల్ అవడమే కాదు నయన్ పోస్ట్ పై పలు విమర్శలు, ట్రోల్స్ రావడంతో నయనతార ఆ పోస్టు ని డిలేట్ చేసింది. మొన్న సమంత-ఈరోజు నయనతార హెల్త్ టిప్స్ విషయంలో అనవసరంగా నెటిజెన్స్ కి టార్గెట్ అయ్యారు.