పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ లో అసహనం, అనుమానం, ఆగ్రహం అన్ని స్టార్ట్ అయ్యాయి. మారుతి తో ప్రభాస్ సినిమా ససేమిరా వద్దు అని రిక్వెస్ట్ చేసారు. మారుతిని ట్రోల్ చేసారు. మారుతిని చిన్న చూపు చూసారు. అందులోను ప్లాప్ లో ఉన్న దర్శకుడితో పాన్ ఇండియా స్టేటస్ ని మైంటైన్ చేసే ప్రభాస్ సినిమా చెయ్యకూడదు అని పట్టుబట్టారు.
అందుకే మారుతి కూడా ప్రభాస్ కి కథ చెప్పి కమిట్ చేయించి సైలెంట్ గా సెట్స్ మీదకి వెళ్ళిపోయాడు. సన్నిహితులతో మారుతి-ప్రభాస్ సినిమాపై లీకులు ఇప్పిస్తూ ఫ్యాన్స్ కి కాస్త కోపం పోగొట్టే ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత సినిమాకి రాజా సాబ్ అనే టైటిల్ తో పాటుగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని వదిలాడు. ప్రభాస్ రాజాసాబ్ లుక్ లో వింటేజ్ ప్రభాస్ ని చూసి ఆయన ఫ్యాన్స్ మురిసిపోయారు.
తాజాగా ఫ్యాన్ ఇండియా గ్లిమ్ప్స్ తో మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ నోరు మూయించాడంటూ మారుతి సన్నిహితులు సోషల్ మీడియాలో మట్లాడుకుంటున్నారు. వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తూ ఆయన లుక్, ఆయన కేరెక్టర్ కూడా జోవియల్ గా ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ రిలాక్స్ కాదు కాదు కూల్ అవుతున్నారు. రాజా సాబ్ గ్లిమ్ప్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ని తిట్టకుండా నోరు మూసుకునేలా గ్లిమ్ప్స్ ఉన్నాయంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
అంతేకాదు సోషల్ మీడియాలో మారుతిపై నోరేసుకుని దిగబడిన వాళ్లంతా ఇప్పుడు రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతున్న క్షణాల కోసం వెయిట్ చేసేలా ఆ గ్లిమ్ప్స్ ఉన్నాయంటూ మాట్లాడుతున్నారు.