పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ చాలా ఏళ్ళకి ఇదే కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలయ్యింది. గ్రాండ్ గా మొదలైన ఈ చిత్రం కోసం హరీష్ శంకర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ని వెయిట్ చేయిస్తూ ఉన్నాడు. మధ్యలో ఓ పది పదిహేను రోజులు సెట్స్ లో జాయిన్ అయిన పవన్ ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసారు. కానీ ఉస్తాద్ ని పక్కనపెట్టేశారు.
ఇక రాజకీయాల్లో పవన్ సంచలన విజయం తర్వాత ఆయన నటించే సినిమాల విషయంలో ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఒక మూడు నెలలు వెయిట్ చెయ్యండి.. నేను పూర్తి చెయ్యాల్సిన సినిమాలు పూర్తి చేస్తా అని స్వయానా పవన్ చెప్పారు. పవన్ ఫ్రీ అయ్యి వచ్చినా హరి హర వీరమల్లు, OG చిత్రాలు పూర్తి చేస్తారు, ఎందుకంటే వీరమల్లు, OG తక్కువ షూటింగ్ బాలన్స్ ఉన్నాయి. అందుకే పవన్ అవే పూర్తి చేస్తారు.
పది, పదిహేను రోజులు షూట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ని పవన్ కళ్యాణ్ ఆపేస్తారనే టాక్ ఎప్పుడో మొదలైంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ పై ఎలాంటి అపోహలు వద్దు, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు పవన్ భరోసా ఇచ్చారు అని తెలుస్తోంది. ఉస్తాద్ కోసం పవన్ 60 రోజుల పాటు కేటాయించాలని, వీలున్నప్పుడు తప్పకుండా సినిమాని పూర్తి చేస్తానని మైత్రి వారికి పవన్ మాటిచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. సో పవన్ ఫ్యాన్స్ ఏం టెన్షన్ పడక్కర్లేదు.