Advertisementt

స్పిరిట్ : ప్రభాస్ డ్యూయెల్ సెన్సేషన్

Mon 29th Jul 2024 08:05 PM
prabhas  స్పిరిట్ : ప్రభాస్ డ్యూయెల్ సెన్సేషన్
Prabhas bracing for Spirit sensation స్పిరిట్ : ప్రభాస్ డ్యూయెల్ సెన్సేషన్
Advertisement
Ads by CJ

సలార్, కల్కి 2898 AD చిత్రాలతో మరోసారి స్టామినా చూపించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇక రాజా సాబ్ తో మరోసారి అభిమానులను వింటేజ్ ప్రభాస్ గా, డార్లింగ్ ప్రభాస్ గా అలరించడానికి సిద్దమవుతున్నాడు. రాజా సాబ్ తర్వాత హను రాఘవపూడి తో ప్రభాస్ ముందు సెట్స్ మీదకి వెళతాడనే న్యూస్ ఉంది 

ఆ తర్వాత ప్రభాస్ మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ చిత్రానికి కమిట్ అయ్యాడు. ఈ చిత్రంలో ప్రభాస్ ని సందీప్ ఎలా చూపించనున్నాడో అనే విషయంలో సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని రివీల్ చేసేసారు. అయితే తాజాగా స్పిరిట్ పై మరికొన్ని రూమర్స్ తెగ హైలెట్ అవుతున్నాయి. 

ప్రభాస్ ఈ చిత్రంలో డ్యూయెల్ సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నాడట సందీప్. సందీప్ రెడ్డి ప్రభాస్ ని రెండు పాత్రల్లో చూపించబోతున్నారట. అందులో ఒకటి పోలీస్ పాత్ర కాగా మరొకటి ప్రభాస్ పాత్రకి నెగెటివ్ టచ్ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ప్రభాస్ రెండో పాత్రని సందీప్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. 

ఇక ఈ రెండో పాత్రని స్పిరిట్ ఇంటర్వెల్ బ్లాక్ లో రివీల్ చేస్తారట. ఆ పాత్ర పరిచయం స్పిరిట్ హైలెట్స్ లో నెంబర్ 1 గా నిలవడం ఖాయమంటున్నారు. మరి ఇది రూమరా లేదంటే నిజమా అనేది తెలియదు అయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

Prabhas bracing for Spirit sensation:

Spirit: Sandeep Vanga Plans Powerful Duals For Prabhas

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ