సౌత్ నుంచి బిషణా ఎత్తేసి హిందీలో జెండా పాతే ప్రయత్నాల్లో ఉంది తాప్సి పన్ను. అక్కడ సక్సెస్ అవుతున్నా కొన్ని కారణాల వలన ఫేమస్ అవ్వలేకపోతున్నా అంటూ తరచూ తాప్సి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఫిర్ అయీ ఆసిన్ దిల్రుబా చిత్రం ద్వారా నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తాప్సి తన భర్త మథియాస్ బో పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
మథియాస్ బో డెన్మార్క్ మాజీ బ్యాట్మెంటిన్ ప్లేయర్. మథియాస్ తో తాప్సి కొన్నేళ్లు డేటింగ్ చేసాక ఈ ఏడాది ఎవ్వరిని పిలవకుండా కుటంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా వివాహం చేసుకుంది. ఆ విషయాన్ని కూడా తాప్సి ఆచి తూచి బయటపెట్టింది. ఇప్ప్పుడు తన భర్త మథియాస్ బో గురించి చాలామందికి పెద్దగా తెలియకపోవడం తనకి ఆశ్చర్యంగా, బాధగా ఉంది అంటుంది.
తన భర్త గురించి కొంతమందికి అసలు ఏమి తెలియదు. వారి పట్ల బాధగా ఉంది. ఆయనేమి ఫేమస్ క్రికెటర్ కాదు, బిజినెస్ మ్యాన్ అంతకన్నా కాదు, ఇప్పుడు నేను బయటికి వచ్చి అతని గురించి చెప్పాలనుకోవడం లేదు. ప్రపంచంలో బ్యాట్మెంటన్ లోనే అతి పెద్ద విజయాలు సాధించిన మథియాస్ గురించి మీరు తెలుసుకోవాలనుకోవడం లేదు అంతే అంటూ తాప్సి భర్త గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.