సోషల్ మీడియాలో నందమూరి వారసుడు మోక్షుజ్ఞ టెస్ట్ షూట్ ఎంతగా వైరల్ అయ్యింది అనేది చెప్పడం కష్టమే. మోక్షు ఎంట్రీ పై ఫోటో షూట్ వదిలితే ఎంత క్రేజ్ వచ్చిందో.. అదే సమయంలో మోక్షజ్ఞ తెరకి పరిచయం కావడం పై అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అనేది క్లారిటీ వచ్చేసింది. మోక్షజ్ఞ టెస్ట్ షూట్ లో పాస్ అవడం కాదు.. డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు.
ఇప్పుడు హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది అభిమానుల ముందున్న ప్రశ్న. దర్శకుడిగా ప్రశాంతవర్మ ఫిక్స్. ఆ విషయాన్ని కూడా లీకులిచ్చేశారు. ప్రశాంత్ వర్మ కూడా మోక్షజ్ఞ మూవీ పైనే కూర్చున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యాడు.
మహాభారతంలోని ఓ భాగాన్ని మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ సెలెక్ట్ చేసుకున్నాడంటున్నారు. ఈ ఫాంటసీ సోషల్ డ్రామాని పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కించబోతున్నట్టు వినికిడి. బాలయ్య ప్రశాంత్ వర్మ కి కావాల్సినంతగా భరోసా ఇస్తున్నారట. అటువైపు బడ్జెట్ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. మరి మోక్షజ్ఞ విషయంలో తెర వెనుక జరుగుతున్న పనులు అభిమానులను సంతోషపెడుతున్నా ఆ ప్రకటన వస్తే కానీ వారి ఆత్రం తగ్గేలా లేదు.