చంద్రబాబు ఏపీలో ఉండడు, ఇక్కడ అద్దె ఇంట్లో ఉండే చంద్రబాబు హైదరాబాద్ వేదికగా ఏపీ ని పాలిస్తాడా.. హైదరాబాద్ లో ఉండి ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు, ఎప్పుడు హైదరాబాద్ లో రెస్ట్ తీసుకునే చంద్రబాబు ఏపీకి మంచి చేస్తాడా, హైదరాబాద్ లో షూటింగ్స్ చేసుకునే పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజల గోడు ఏం పడుతుంది, ఇక్కడ జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్లి టెస్ట్ లు చేయించుకుంటాడు అంటూ మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు, మంత్రులు గతంలో పదే పదే మాట్లాడేసేవారు. అది వాళ్లకు తప్పనిపించలేదు.
కానీ ఇప్పుడు జగన్ పదే పదే బెంగుళూరు వెళ్లడం పై టీడీపీ నేతలు మట్లాడకూడదట. ఆయనేదో పర్సనల్ వ్యవహారాలు చూసుకుంటనున్నారు. రాజకీయాల్లోకి రాకముందు బెంగుళూరు వేదికగా వ్యాపారాలు చేసుకునేవారు, రాజకీయాల్లోకి వచ్చారు పోరాడారు, 2019 లో అధికారం చేజిక్కించుకున్నారు. దానిని 2024 లో పోగట్టుకున్నారు. అందుకే వ్యాపారాల కోసం బెంగుళూరు వెళుతున్నారు.
ఆ మాత్రం దానికి జగన్ బెంగుళూరు వెళ్లినా టీడీపీ వాళ్ళు ఏడుస్తున్నారు. కూటమి ప్రభుత్వం తప్పు చేసేవరకు జగన్ వెయిట్ చేస్తున్నారు. అప్పుడు రంగంలోకి దిగుతారంటూ బ్లూ మీడియా జగన్ కి భజన మొదలు పెట్టింది. జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడు బెంగుళూరు వెళ్ళేది వ్యాపారాల కోసం అని తేల్చేసింది.
అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తే ఏడ్చేసే బ్లూ మీడియా జగన్ బెంగుళూరు టూరు విషయంలో వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటో.. అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.