మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈమధ్యన హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపించడమే కాదు.. వరుణ్ తేజ్ మాదిరి అందరికి ట్విస్ట్ ఇచ్చి పెళ్లి పీటలెక్కబోతున్నాడనే న్యూస్ వైరల్ గా మారింది. జవాన్ సినిమా టైమ్ లోనే సాయి ధరమ్ తేజ్ మెహ్రీన్ కౌర్ తో ప్రేమలో పడ్డాడు, గుట్టు చప్పుడు కాకుండాప్రేమాయణం నడిపిస్తున్నారు, అతి త్వరలోనే వీరి పెళ్లి ముచ్చట వినిపించడం ఖాయమనే మాట తెగ చక్కర్లు కొట్టింది.
తాజాగా సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి విషయమై స్పందించాడు. గత రాత్రి ఓ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా రావడంతో మీడియా సాయి ధరమ్ ని పెళ్లి విషయమై కదిపింది. దానితో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. వన్ సైడ్ లవ్ ఉంది. అటు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, ఒకవేళ స్పందించి మాట్లాడే లోపు మీకు పెళ్లయిపోయింది కదా అంటున్నారు. నాకు పెళ్లా.. అని షాకయితే మొన్న మీడియాలో చూశామంటూ చెబుతున్నారు.
అదేమిటి అతి త్వరలో మెగా ఫ్యామిలిలో పెళ్లి జరగబోతుంది, అది సాయి తేజ్ ది అనడమే కాదు.. మీ పెళ్లి విషయంలో ఇద్దరు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి నిజమేనా అని అడిగితే.. నా సినిమాలో నో పెళ్లి అనే సాంగ్ ఉంది మీకు తెలుసుగా.. అంటూ అసలు విషయం చెప్పకుండా కన్ఫ్యూజ్ చేసాడు.
అయితే నో పెళ్లి అంటే సాయి తేజ్ అసలు పెళ్లి చేసుకోడా అనే అనుమానాలు జనాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ముచ్చటపై సాయి తేజ్ ఏమంటాడో చూడాలి.