ఓడిపోయాక ఎలా మళ్ళీ సర్వైవ్ అవ్వాలా అని ఆలోచిస్తున్న జగన్ కి అడుగడుగునా శాపం తగులుకున్నట్టుగా చెల్లి షర్మిల అడ్డం పడుతుంది. ఫ్యామిలీ లో ఎలాంటి గొడవలు జరిగాయో, ఏ ఆస్తుల పంపకాల దగ్గర గొడవైందో.. లేదంటే గత ప్రభుత్వంలో తనకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనో షర్మిల జగన్ పై కక్షసాధింపు చేస్తుంది అనే వారు లేకపోలేదు.
ఏదో తెలంగాణాలో పార్టీ పెట్టుకుని తన బ్రతుకు తాను బ్రతుకుతుంది అని రిలాక్స్ అయిన జగన్ కు తలపోటులా తయారై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల రావడమే జగన్ కి శాపం పట్టుకుంది. షర్మిల వలన తన పార్టీకి నష్టం కలిగిందో, లేదో.. కానీ ఆమె వలన వైసీపీ ఓట్లు చీలిపోయాయి. రాజశేఖర్ బిడ్డగా అంతో ఇంతో అభిమానం ఉన్నోళ్లు షర్మిలకు ఓటేశారు.
అక్కడ వైసీపీ కి దెబ్బ పడింది. జగన్ కి ఓటమి షురూ అయ్యింది. అంతేకాదు మరో చెల్లి సునీతతో కలిసి షర్మిల బాబాయ్ హత్య కేసులో జగన్ ని బ్లేమ్ చెయ్యడం ఇవన్నీ జగన్ కి మైనస్ అయ్యి కూర్చున్నాయి. షర్మిల కొడుకు పెళ్లి లో జగన్ కనిపించకపోవడం పై కూడా ఏపీ ప్రజల్లో చెల్లికి న్యాయం చెయ్యలేనోడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అనే అనుమానం క్రియేట్ అయ్యేలా చేసింది.
ఇక ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పదే పదే అన్న జగన్ ని షర్మిల టార్గెట్ చేస్తుంది. ఢిల్లీ వెళ్ళి వినుకొండ హత్యని హైలెట్ చేయడం పై జగన్ పై వ్యంగ్యంగా స్పందించింది. రోజుకో ట్వీట్ వేస్తూ సోషల్ మీడియాలో అన్నపై ఆగ్రహం చూపిస్తుంది. ఒకపక్క కూటమి ప్రభుత్వ ఆరోపణలు, మరోపక్క చెల్లి టార్గెట్ రెండిటిని ఎలా భరిస్తున్నాడో పాపం జగన్ అంటూ నెటిజెన్స్ జాలి పడిపోతున్నారు.