గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతూ సెప్టెంబర్ 27 న విడుదలకు సిద్దమవుతున్న దేవర పార్ట్ 1 షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ లపై విదేశీ లొకేషన్స్ లో సాంగ్స్ చిత్రీకరణ పూర్తయితే దేవర షూటింగ్ కంప్లీట్ అయినట్లే.
దేవర పై ఏ న్యూస్ వినిపించినా దానిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. తాజాగా దేవర పార్ట్ 1 సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయంటూ, సముద్రంలా ప్రశాంతంగా కనిపించే ఎన్టీఆర్ పాత్రలో సునామీ లాంటి విధ్వంస కారుడు కూడా కనిపిస్తాడని.. సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ కేరెక్టర్ పై ఈ వేరియేషన్ చాలా బలంగా కనిపిస్తోందని.. యూనిట్ సభ్యులు కొంతమంది సన్నిహితులతో షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది.
ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ -సైఫ్ అలీ ఖాన్ ల మధ్యన రసవత్తరమైన యాక్షన్ చూద్దామా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా కాచుకుని కూర్చున్నారు. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తంగం పాత్రలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుంది.
రీసెంట్ గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా దేవర లో భాగమయ్యాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టడంతో దేవర పై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.