నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్. వరస పాన్ ఇండియా మూవీస్ తో నార్త్ హీరోయిన్స్ కి గట్టి పోటి ఇస్తుంది ఈ అమ్మడు. గ్లామర్ రోల్స్, పెరఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్, బోల్డ్ కేరెక్టర్స్ ఇలా దేనికి మొహమాటపడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.
తెలుగు, తమిళ, హిందీ సినిమాలంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కుతూ దిగే ఫ్లైట్ దిగుతుంది. వరస షిఫ్ట్స్ లో పని చేస్తుంది. ఇక్కడ పుష్ప 2 షూటింగ్ తో పాటుగా మరో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తెలుగు, తమిళంలో ఏకకాలంలో చేస్తుంది. ఇక తమిళనాట తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కుబేర పాన్ ఇండియా ఫిలిం, తమిళ డైరెక్టర్ మురుగదాస్ తో హిందీ హీరో సల్మాన్ ఖాన్ తో సికిందర్ లో నటిస్తుంది. అవన్ని క్రేజీ సినిమాలే.
అయినప్పటికీ చిన్నపాటి ఖాళీ దొరికితే చాలు సోషల్ మీడియాలో వాలిపోతుంది. అంతేకాదు షాప్ ఓపినింగ్స్ ని కూడా క్యాష్ చేసుకుంటున్న ఈ హీరోయిన్ తాజాగా కేరళలో వెబ్స్ ఇండియా మాల్ ఓపెనింగ్ లో కనిపించింది. గ్రీన్ శారీ లో రష్మిక అద్భుతమైన అందాన్ని ప్రదర్శించింది.
ఆ మాల్ ఓపెనింగ్ కి ముందే సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ వదిలింది. రష్మిక గ్రీన్ శారీ లో తలలో రోజా పూలతో చాలా ట్రెడిషనల్ గా కనిపించినా కన్ను కొట్టి కొంటె పిల్లలా చూస్తుండడం యూత్ ని చొంగ కార్చుకునేలా చేసింది. మీరు రష్మిక కన్ను గీటే పిక్స్ ని ఓ లుక్కెయ్యండి.