Advertisementt

హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ వదిలేసిందట !!

Sun 28th Jul 2024 10:03 PM
rithu chowdary  హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ వదిలేసిందట !!
Jabardasth left because of Hyper Aadi! హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ వదిలేసిందట !!
Advertisement
Ads by CJ

సీరియల్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన రీతూ చౌదరి ఆ తర్వాత జబర్దస్త్ లోకి రాగానే మరింతగా పాపులర్ అయ్యింది. అయితే జబర్దస్త్ లో కొన్నాళ్లుగా రీతూ చౌదరి కనిపించడం లేదు. అలాగని సీరియల్స్ కూడా చెయ్యడం లేదు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో రీతూ చౌదరి గ్లామర్ షో చేస్తూ సెలెబ్రిటీ ఇంటర్వూస్ చేస్తుంది. అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ మొదలు పెట్టింది.

అప్పుడప్పుడు ఈటివి ఫెస్టివ్ ప్రోగ్రామ్స్ లో కనబడుతున్న రీతూ చౌదరి దావత్ ప్రోగ్రాం తో హైలెట్ అవుతుంది. తాజాగా జబర్దస్త్ ఎందుకు మానేసారు అని రీతుని అడిగితే కారణం హైపర్ ఆది అని చెప్పి షాకిచ్చింది. హైపర్ అది లేకుండా జబర్దస్త్ చెయ్యలేకపోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

కొన్నాళ్లుగా హైపర్ ఆది జబర్దస్త్ నుంచి బయటికొచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో అలాగే సినిమాల్తో బిజీగా ఉంటున్నాడు. కానీ జబర్దస్త్ ని మాత్రం ఆది వదిలేసాడు. ఆది ఈ షో నుంచి తప్పుకున్న తర్వాత నాకు కూడా జబర్దస్త్ షోలో చేయాలని అనిపించలేదు. నాకు జబర్దస్త్ లో పేరు రావడానికి కారణం ఆది గారే. అందుకే ఆయనలేని చోట ఉండలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు వేరే షోలు చేసుకుంటున్నాను అని చెప్పిన రీతూ చౌదరి కి సినిమా అవకాశాలు కూడా చాలా వచ్చాయట. కానీ అవన్నీ బోల్డ్ కేరెక్టర్స్ కావడంతో చెయ్యడం లేదు అని, తనకి ఆఫర్ ఇచ్చేవాళ్ళు కూడా నువ్వు బోల్డ్ గా ఉంటావు, అందుకే ఈ కేరెక్టర్ కి సెలెక్ట్ చేశామని చెప్పడం నచ్చకే సినిమాలు చెయ్యడం లేదు అని చెప్పుకొచ్చింది రీతూ. 

Jabardasth left because of Hyper Aadi!:

Rithu Chowdary Left Jabardasth For Hyper Aadi

Tags:   RITHU CHOWDARY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ