దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ vs డబుల్ ఇస్మార్ట్ క్లాష్ పై మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆగస్టు 15 న రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి రామ్-రవితేజ ల ఫైట్ అంటే ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కానీ నిర్మాతలకే ఆదుర్దా మొదలవుతుంది. ఇప్పటికే హరీష్ శంకర్-రవితేజ లపై కోపంతో నిర్మాత ఛార్మి కౌర్ వారిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లుగా మీమ్స్ వస్తున్నాయి.
తాజాగా హరీష్ శంకర్ ని ఓ రిపోర్టర్ డబుల్ ఇస్మార్ట్ మీ గురువుగారి సినిమా, పూరికి మీరు శిష్యుడు కదా, గురు - శిష్యుల పోటీలా ఉంది అని అడిగితే డెఫనెట్ గా పూరి గారు డైనమిక్ డైరెక్టర్. రాజమౌళి, పూరి, వినాయక్ గార్లు నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎంకరేజ్ చేసారు. ముగ్గురు నాకు గురుతుల్యులు. పూరి జగన్నాథ్ తో నాకు ఎక్కువ అనుబంధం ఉంది.
పూరి గారితో పోటీ పడే స్థాయి నాకు లేదు. ఆయనొక లెజెండ్, మాకైతే పోటీ పడే ఉద్దేశ్యం లేదు. అసలు రిలాక్స్ గా వద్దామనుకున్నాము. కానీ కొన్ని నిర్మాతల ప్రోబ్లెంస్ వలనో, ఓటీటీ ల ఇష్యు వలనో, అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది. ముందుగా డబుల్ ఇస్మార్ట్ డేట్ అనౌన్స్ చేసారు. మాకు వచ్చే ఉద్దేశ్యం లేదు. కానీ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ శశి ఆగష్టు 15 కి రావాల్సిందే అని పట్టుబట్టారు. వారి పుష్ప పోస్ట్ పోన్ అవ్వొచ్చు, మారేదన్నా కారణం కావొచ్చు.
అందుకే రెండు సినిమాలు క్లాష్ అవుతున్నాయి. పూరి గారితో నాకు సాన్నిహిత్యం ఉంది. ఒక్క సినిమా వలన నాకు పూరి గారికి మాటలుండవని, ఎడ మొహం పెడ మొహం ఉంటారనుకోను అని చెప్పిన హరీష్ ని.. ఛార్మి మమ్మల్ని అన్ ఫాలో చేసిందిగా అని అడిగితే.. అదంతా నాకు తెలియదు. నేను సోషల్ మీడియా చూడడం లేదు, ఏవో మీమ్స్ నాకు పంపించారు అంతే. నేను వాటిని పట్టించుకోను. నిర్మాతలకు ఇబ్బంది ఉంటుంది. డెఫ్ నెట్ గా మరో సినిమా పోటీకి వస్తుంది అంటే నిర్మాతలకు ఆ ఇరిటేషన్ ఉంటుంది అంటూ మిస్టర్ బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ క్లాష్ లపై హరీష్ స్పందన ఉంది.
అంతేకాదు డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్ తో నా సినిమా ఉంది. నా తదుపరి హీరో సినిమాపైకి నేను పోటీకి కావాలని వెళ్ళము కదా అంటూ హారిష్ చెప్పుకొచ్చాడు.