పవన్ కళ్యాణ్ గురించి తెలిసే ఆయనతో ఇంకా సినిమాలు చెయ్యాలని అనుకునే నిర్మాతలు ఉన్నారా.. అసలు ఆయన మధ్యలో వదిలిన సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయా అని ఆయా నిర్మాతలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని కూర్చున్నారు. అటు చూస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఏపీ లో పలు సమస్యలను చక్కబెట్టే పనిలో కార్యసాధకుడిలా మారారు.
అంతేకాదు సినిమాల్లో చెప్పే డైలాగ్స్ ని నిజం చేసి చూపిస్తున్నారు. అమ్మాయి వంటి మీద చెయ్యిపడితే తాట తీస్తా అన్నట్టుగా ఏపీలో అమ్మాయిలను ఏడిపించిన, అమ్మాయిల మీద చెయ్యి వేసినా వాడిని ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన.. అలా ఏపీలో పవన్ కళ్యాణ్ బిజీగా వున్నారు. ఒక మూడు నెలలు ఆగమని తన నిర్మాతలు ఆయన చెప్పారు.
వీరమల్లు, OG చిత్రాలను చక చకా ఫినిష్ చేసి పవన్ మళ్ళీ వెళ్ళిపోతారని, ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా పవన్ ఇక కంటిన్యూ చెయ్యరు, ఆపేస్తారే టాక్ వినిపిస్తుండగా.. ఎప్పుడో పవన్ కళ్యాణ్ తో ఓకె అనిపించుకున్న సురేందర్ రెడ్డి మూవీపై ఈ రోజో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
అది నిర్మాత రామ్ తాళ్లూరి ని పవన్ సినిమా ఏం చేసారు అని అడిగితే.. సురేందర్ రెడ్డి - పవన్ కళ్యాణ్ కాంబో సినిమాకి మా సైడ్ నుంచి కావాల్సింది అంతా రెడీ.. అంటూ రామ్ తాళ్లూరి పవన్ సినిమా పై ఓపెన్ అయ్యారు.
అది విన్న నెటిజెన్స్ మీరు రెడీనే.. కానీ పవన్ రెడీ అనాలిగా అంటూ సరదాగా పవన్ కళ్యాణ్ బిజిపై, రామ్ తాళ్లూరి ఆశలపై కామెంట్స్ చేస్తున్నారు.