ఎప్పుడో మార్చ్ లోనే సినిమాని విడుదల చేస్తా అంటూ పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ ని పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టిన రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాడు. కానీ మార్చ్ లో డబుల ఇస్మార్ట్ విడుదల సాధ్యం కాలేదు. దానితో జూన్ అన్నారు. ఆ తర్వాత అది ఆగష్టు 15 కి మారింది. ఆగష్టు 15 కి పుష్ప 2 వస్తుంది అనుకుంటే.. అది వెనక్కి తగ్గడంతో అప్పటికప్పుడు ఆ డేట్ ని పూరి జగన్నాధ్ లాక్ చేసేసాడు.
వావ్ సూపర్ డేట్ పట్టేసింది అనుకునేలోపు హరీష్ శంకర్-రవితేజ ల మిస్టర్ బచ్చన్ రేస్ లోకి వచ్చేసింది. వరసగా నిరాశ పరిచే సినిమాల్తో కేరీర్లో డల్ అయిన రవితేజని మిస్టర్ బచ్చన్ తో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించేలా ఉన్నాడు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ నుంచి వస్తున్న సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కాసేపట్లో వచ్చే టీజర్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పేక్షకుల్లో కనిపిస్తుంది.
మరి సోలో డేట్ అనుకుంటే మిస్టర్ బచ్చన్ రూపంలో డబుల్ ఇస్మార్ట్ ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు అంటున్నారు ట్రేడ్ నిపుణులు. కేవలం ఓపెనింగ్స్ మాత్రమే కాదు.. కలెక్షన్స్ పై కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ మిస్టర్ బచ్చన్ రూపంలో డబుల్ ఇస్మార్ట్ పై ప్రభావం పడినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. రెండు సినిమాల్లో దేనికి పాజిటివ్ టాక్ వచ్చినా లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ మాత్రం కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుండగా.. అది ఏ సినిమా అనేది ప్రేక్షకులు డిసైడ్ చెయ్యాల్సి ఉంటుంది.