జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి పదవి వచ్చాక ప్రతిపక్షం పై అనరాని మాటలతో చెలరేగిపోయాడు. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీతో పాటు మంత్రులు, ఎమ్యెలీలు ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయిన బుగ్గన ఇప్పుడు హైదరాబాద్ లో తేలారు. ఏపీలో ఆర్థికశాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఇది శ్వేతపత్రమా లేక సాకు పత్రమా అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని అన్నారు. వైట్‌పేపర్‌లో సమస్యలు చెప్పి, వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ఇలా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించడానికి రీజన్ ఉంది అంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బుగ్గన తన వ్యాపారాలు కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరదామని చాలా ప్రయత్నాలు చేసినట్లుగా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఉండి కేంద్ర పెద్దలను కలుస్తూ వచ్చారు. కానీ బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో.. ఇతరుల ద్వారా రాయబారం నడిపారని వార్తలు వచ్చాయి.
మొత్తానికి బీజేపీ పెద్దల నుంచి మాజీ మంత్రి బుగ్గనకి బీజేపీ హై కమాండ్ నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. అలా బుగ్గనకు రెడ్ కార్డ్ చూపించడంతోనే బుగ్గన మళ్లీ జగన్ పంచన చేరినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి, జగన్ కు అనుకూలంగా మాట్లాడారు అంటూ టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.