కొద్దిరోజుల పాటు ఖాళీగా ఉన్న శ్రీలీల సోషల్ మీడియాలో మాత్రం ఫోటో షూట్స్ షేర్ చేస్తూ యాక్టీవ్ గా కనిపించింది. అంతేకాదు మధ్య మధ్యలో షాప్ ఓపెనింగ్స్ లోను హల్ చల్ చేస్తుంది. ఇక ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో ఉంది. మరోపక్క రవితేజ వస్తే ఆ మూవీ సెట్స్ లోకి జంప్ అవ్వాల్సి వస్తుంది.
ఈ రెండు చిత్రాలు ఫినిష్ అయ్యేలోపు అమ్మడుకి మరిన్ని అవకాశాలు రావడం అయితే పక్కా. మరి ఈ మధ్యలో ఫ్రీ గా ఉండడం ఎందుకు అని ఫోటో షూట్స్ కి సమయాన్ని వెచ్చిస్తుంది. తాజాగా సోఫా పై పడుకుని రిలాక్స్ అవుతున్న ఫొటోస్ వదిలింది. అలిసిపోయి అలా నిద్రపోతుందా అనుకునే లోపు పక్కకి చూస్తూ చిరు నవ్వులు చిందించింది శ్రీలీల.
బ్లాక్ మిడ్డీ లో శ్రీలీల అందాలు కనిపించకపోయినా ఆ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసి రిలాక్స్ అవుతున్న శ్రీలీల అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.