Advertisementt

దేవర సైలెన్స్ ని భరించలేకపోతున్న ఫ్యాన్స్

Sat 27th Jul 2024 07:15 PM
devara  దేవర సైలెన్స్ ని భరించలేకపోతున్న ఫ్యాన్స్
Jr Ntr Fans Upset on Devara Promotions దేవర సైలెన్స్ ని భరించలేకపోతున్న ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27 న విడుదలవుతుంది. అంటే ఖచ్చితంగా దేవర 1 విడుదలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అటు చూస్తే దేవర టీమ్ సైలెంట్ గా పనులు చక్కబెట్టుకుంటుంది. పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలి. రెండు నెలల ముందు నుంచే సోషల్ మీడియాలో మోత మోగిపోవాలి.

కానీ దేవర నుంచి ఫస్ట్ సింగిల్ వదిలిన తర్వాత ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు. దేవర సెకండ్ సింగిల్ అదిగో ఇదిగో అంటున్నారు కానీ.. అంతవరకు దేవర మేకర్స్ నుంచి ఎలాంటి ఊసు లేదు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. ఇంత సైలెంట్ అయితే ఎలా అంటూ మేకర్స్ ని తగులుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ విజయం తర్వాత రాబోతున్న సినిమా అంటే ఎలా ఉండాలి అనేది వారి ఆరాటం.

ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 కంప్లీట్ చేసేసి ముంబై వెళ్ళిపోతాడట. అక్కడ ఆయన వార్ 2 షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈలోపులో మెల్లగా పాన్ ఇండియా మార్కెట్ లో దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే అటు ముంబై టూర్ కూడా దేవరకు ప్లస్ అయ్యి నార్త్ లో క్రేజ్ పెరుగుతుంది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్రుత. మరి మేకర్స్ ఈ విషయంలో మౌనం వీడితే బావుంటుంది. 

Jr Ntr Fans Upset on Devara Promotions:

Devara update please: NTR fans request

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ