అసెంబ్లీలో అధికార-ప్రతిపక్షాలు సమ ఉజ్జిలుగా ఉండి కొట్లాడకుంటేనే మజా ఉంటుంది. అధికార పక్షం ప్రతిపక్షం తప్పులను ఎత్తి చూపుతూ స్టేట్మెంట్స్ ఇస్తే దానిని డిపెండ్ చేసుకోవడానికి ప్రతిపక్షం వాదించడం, అధికార పక్షం చేసే తప్పులను ప్రతి పక్షం ఎత్తి చూపడం వంటి విషయాలతో అసెంబ్లీ హోరెత్తిపోతుంది. అలా అసెంబ్లీ సమావేశాలను చూసేందుకు ప్రజలు కూడా ఇంట్రెస్ట్ చూపుతారు.
కానీ ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం ముందు నిలవలేక ప్రతి పక్ష హోదాలేని జగన్ ఎమ్యెల్యేలు పారిపోతున్నారు. అసెంబ్లీలో అధికార పక్షం చేసే ఆరోపణలు తిప్పి కొట్టాల్సిందిపోయి ప్రతి పక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రామన్నట్టుగా ఏదో సాకు చెప్పి అసెంబ్లీ లో అధికార పక్షం తమపై ఆరోపణలు చేస్తుంటే బయట కూర్చుని జగన్ ప్రెస్ మీట్ పెట్టడం కామెడీగా తయారైంది.
అసెంబ్లీలో జగన్ ప్రభుత్వ అవినీతి లెక్కలు గురించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కథలు కథలుగా చెబుతుంటే మేము తప్పు చెయ్యలేదు, దీనికి ఇంతయ్యింది, దానికి ఇంతయ్యింది అని చెప్పాల్సిన వైసీపీ ఎమ్యెల్యేలు అసెంబ్లీలో కనిపించక పోవడం హాస్యాస్పదమే. మరి అసెంబ్లీ అన్నాక బలమైన ప్రతిపక్షం లేకపోతే అక్కడున్నవాళ్ళకి బోరే, చూసేవాళ్లకు బోరింగ్ అనేలా ఏపీ అసెంబ్లీ కనిపిస్తుంది.