వైసీపీ ని 2024 ఎన్నికల్లో ఓటమికి దగ్గర చేసిన జగన్.. ఆ ఓటమి పై ఆలోచించాలో.. లేదంటే చెల్లి షర్మిలను ఎదుర్కోవాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఓటమి తర్వాత కూడా మారకుండా చంద్రబాబు పాపాలు లెక్కలు చూసాక మాట్లాడతాను అన్నట్టుగా బిహేవ్ చేసిన జగన్ ఈ మద్యన వినుకొండ వైసీపీ కార్యకర్త హత్య కేసు విషయంలో హడావిడి చేసాడు. ఢిల్లీకి పోయి ఇతర పార్టీల మద్దతు మూటగట్టుకుని ఏదో ధర్నా చేశాను అనిపించాడు. ఇండి కూటమిలో కాంగ్రెస్ తప్ప మిగతా చాలా పార్టీలు జగన్ ను పరామర్శించాయి.
కానీ కాంగ్రెస్ జగన్ వైపు చూడలేదు. కాంగ్రెస్ కూడా జగన్ కు మద్దతిస్తే బావుండేది, కాంగ్రెస్ తనకు మద్దతు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ జగన్ బాధపడడంపై షర్మిల సోషల్ మీడియా వేదికగా అన్న జగన్ గారిని ఏకి పడేసింది. బీజేపీ తో అక్రమ సంబంధం పెట్టుకున్న మీకు కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చెయ్యాలంటూ రెచ్చిపోయి ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ @INCIndia ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న @ysjagan జగన్ గారు.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు
@BJP4India బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు.. ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం.
క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం?
మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప.. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు? అంటూ షర్మిల అన్న జగన్ ని ఆల్మోస్ట్ రేవెట్టేసింది . అది చూసిన నెటిజెన్స్ పాపం జగన్.. షర్మిల అస్సలు వదిలేలా లేదు.. ఎంత కడుపు మండి ఉందొ అంటూ కామెంట్ చేస్తున్నారు.