నందమూరి మోక్షజ్ఞ న్యూ మేకోవర్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది. బాలయ్య వారసుడు మోక్షజ్ఞని తెరకి పరిచయం చేసే సమయం ఆసన్నమైంది అనే వార్తలు సోషల్ మీడియాలో రోజు దర్శనమిస్తున్నాయి. కొడుకు డెబ్యూ బాధ్యతను హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టి తాను మాత్రం NBK 108 షూటింగ్ చేసుకుంటున్నారు బాలయ్య
ప్రశాంత్ వర్మ కుడా జై హనుమాన్ ని పక్కనబెట్టి మోక్షజ్ఞ సినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ లో బిజీ అయ్యాడు. తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై హైప్ క్రియేట్ చేసే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. మోక్షజ్ఞ కోసం రెడీ చేసిన కథలో హైలెట్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, అవి మీకు చెప్పలేక, నాలో నేను దాచుకోలేక సతమతమవుతున్నాను.
ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం ఓ సంచలనానికి రంగం సిద్ధం చేస్తున్నాడంటూ ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తూ సంబరాలకు రెడీ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ-నిర్మాత నందమూరి తేజస్వి మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అంటూ వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.