ఒకప్పుడు కృతి శెట్టి, కృతి శెట్టి అన్నవాళ్లంతా ఇప్పుడు ఈ బేబమ్మని పట్టించుకోవడం మానేశారు. మొదటి సినిమా విడుదల కాకూండానే వరసగా సినిమాలు సైన్ చేసిన కృతి శెట్టి టాలీవుడ్ టాప్ చైర్ అందుకుంటుంది అనుకున్నారు. కానీ కంటిన్యూగా అమ్మడుకి షాకిచ్చే సినిమాలు వచ్చి పడ్డాయి.
దానితో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి చెక్కసి అక్కడ వరస సినిమాల్లో నటిస్తుంది. మరో వైపు మలయాళం మూవీలో ఛాన్స్. అయినప్పటికి బేబమ్మకి టాలీవుడ్ పైనే కన్ను ఉంది. అందుకే అక్కడ షూటింగ్స్ లో దొరికిన ఖాళీ సమయాన్ని గ్లామర్ ఫొటోస్ తో సోషల్ మీడియాని నింపేస్తుంది.
ఒకప్పుడు సోషల్ మీడియాలో కనిపించని కృతి శెట్టి ఇప్పుడు తరచూ బ్యూటిఫుల్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. తాజాగా మెరూన్ కలర్ శారీ లో బంగారు పాపలా దగ దగ మురిపిస్తోంది. ఆ శారీకి తగ్గట్టుగా ఆభరణాలు ధరించి మెరిసిపోయింది. చీరలో అందాలు కనిపించకపోయినా.. కృతి శెట్టి బ్యూటిఫుల్ లుక్ మాత్రం యూత్ ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. చక్కటి అందం, అదిరిపోయే ఫిగర్ ఉన్న కృతి శెట్టి ని కాస్త పట్టించుకోండయ్యా..!