నిన్న శుక్రవారం జులై 26 న తెలుగు, తమిళంలో విడుదలైన ధనుష్ రాయన్ మూవీకి రెండు భాషల్లోను మిక్సెడ్ రెస్పాన్స్ కనిపించింది. ధనుష్ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన రాయన్ చిత్రం మరో నారప్ప అంటూ కొంతమంది పొగుడుతుంటే.. సినిమాలో రెండు మూడు ఎపిసోడ్స్ తప్ప మిగతావేవీ ప్రేక్షకులకు ఎక్కవంటున్నారు.
ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, ధనుష్ నటన, నేపధ్య సంగీతం, కొన్ని యాక్షన్ సన్నివేశాలు తప్ప రాయన్ మూవీలో ఏమి లేదంటున్నారు. అయితే ఈ చిత్రానికి విడుదలకు ముందున్న బజ్ తో ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. ఫైనల్ గా ఫ్యాన్సీ ధరకు సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది.
రాయన్ సినిమాకు వస్తున్న స్పందన, కలెక్షన్స్ బట్టి మేకర్స్ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేయనున్నారు అని తెలుస్తోంది. అది నెల కావొచ్చు, కాదు అంటే మరో వారం పట్టొచ్చు అంటున్నారు.