గుడివాడ హీరో ఇప్పుడు జీరో అంటూ నెటిజెన్స్ కాదు గుడివాడ ప్రజలే మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ అండతో చెలరేగిపోయి బూతు మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని ప్రస్తుతం ఓటమి పాలై ఇంట్లో కూర్చున్నాడు. జగన్ వెంట్రుక పీకలేరు, నా వెంట్రుక టచ్ చెయ్యలేరు అన్నాడు, ప్రజలే వాళ్లకు గుండు గీసి కూర్చోబెట్టారు.
ప్రస్తుతం కొడాలి నాని సైలెంట్ గా ఉన్నాడు. బయట ఆయనపై ఏవేవో కేసు పెడుతున్నా కొన్నిటిలో హై కోర్టులో కొడాలి నానికి ఊరట కలిగినా.. కొడాలి ని నారా లోకేష్ వదలడనే టాక్ వినిపిస్తూనే ఉంది. సరే అదాల ఉంటే కొడాలి నాని ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్ బారిన పడినట్లుగా తెలుస్తుంది.
అది తెలిసిన నెటిజెన్స్.. సోషల్ మీడియాలో కొడాలి నాని గత వీడియోస్ ని బయటికి తీసి కర్మ ఎవ్వరిని వదలడంటూ కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు కొడాలి నాని మీడియా ముందు నిన్న భువనేశ్వరి గారు ఏం చెప్పారు బాబు కు జైల్లో దోమలు కుడుతున్నాయని చెప్పారు. జైల్లో దోమలు కుట్టక రంభ, ఊర్వశి వచ్చి కన్ను కొడతారా ఈయనకు అంటూ వెటకారంగా మాట్లాడిన వీడియో ని షేర్ చేస్తూ నీకు దోమలు కుట్టే డెంగ్యూ వచ్చింది.. ఈచోటి ఖర్మ ఈచోటే అంటూ పాటేసుకుంటున్నారు.