రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ కి ఎంత ఇంపార్టన్స్ ఇస్తుందో ఆమెని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళకు తెలుస్తుంది. హీరోయిన్ అంటే గ్లామర్ అందుకు తగ్గ ఫిట్ నెస్ ఉండాలని అంతేకాదు ఆరోగ్యంగా ఉండాలన్నా వర్కౌట్స్ చెయ్యాల్సిందే, యోగా నేర్చుకోవాల్సిందే అని చెప్పే రకుల్ ప్రీత్ ఒకప్పుడు బొద్దుగా అందంగా ఉండేది.
కానీ కొన్నేళ్లుగా ఫిట్ నెస్ అంటూ రకుల్ మరీ సన్నగా మారటమే కాదు తన ఫేస్ లో గ్లో కోల్పోయింది. అయినప్పటికీ నాజూగ్గా కనిపించిన రకుల్ తాజాగా జిమ్ లో కఠినమైన వర్కౌట్ చేస్తూ ఆ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో రకుల్ డిఫ్రెంట్ వర్కౌట్స్ చేస్తూ కష్టపడిపోతుంది. అది చూసి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.
ప్రస్తుతం పెళ్లి చేసుకున్నాక కూడా రకుల్ ప్రీత్ కెరీర్ ని వదల్లేదు. తరచూ గ్లామర్ ఫోటో షూట్స్ వదలడమే కాదు.. భర్త తో కలిసి ఎక్కడికి వెళ్లినా ఆ ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.