Advertisementt

కొత్తగా మారుతున్న ఆషిక రంగనాధ్

Fri 26th Jul 2024 01:21 PM
ashika ranganath  కొత్తగా మారుతున్న ఆషిక రంగనాధ్
Ashika Ranganath latest photo shoot కొత్తగా మారుతున్న ఆషిక రంగనాధ్
Advertisement
Ads by CJ

ఆషిక రంగనాధ్ టాలీవుడ్ కి చక్కటి సాంప్రదాయ లుక్ లో అడుగుపెట్టింది. అమిగోస్ లో ఎలా కనిపించినా నాగార్జున నా సామి రంగ చిత్రంలో మాత్రం చీర కట్టు, లంగా వోణీల్లో మురిపించింది. అందానికి అందం, అభినయానికి అభినయం తో ఆషిక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరు తో విశ్వంభర లో అవకాశం దక్కించుకుంది. 

మరి హీరోయిన్స్ అంటే గ్లామర్ కి మారుపేరులా ఉండాలి అని చాలామంది కోరుకుంటారు. అప్పుడే కెరీర్ లో రాణిస్తామని నమ్ముతారు. అందుకే గ్లామర్ షోకి తెర తీస్తారు. ఆషిక రంగనాధ్ కూడా అందాలు ఆరబోసే విషయంలో తనకెలాంటి నియమాలు లేవని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. 

సోషల్ మీడియాలో గతంలో చక్కటి ట్రెడిషనల్ దుస్తుల్లో కనిపించిన ఆషిక రంగనాధ్ ఇపుడు గ్లామర్ విషయంలో ఆలోచనలో ఉన్నట్లుగా ఉంది. కొత్తగా మారటానికి ట్రై చేస్తుంది అనేలా ఆమె లేటెస్ట్ ఫోటో షూట్స్ ఉంటున్నాయి. తాజాగా వైట్ స్లీవ్ లెస్ టాప్ లో జీన్స్ ప్యాంట్ లో అందాలు చూపించే ప్రయత్నం గట్టిగానే చేసింది. ఆషిక రంగనాధ్ లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Ashika Ranganath latest photo shoot:

Stunning Photos of Ashika Ranganath

Tags:   ASHIKA RANGANATH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ