Advertisementt

డబుల్ ఇస్మార్ట్ ముందు పూరి కి ఊరట

Fri 26th Jul 2024 11:22 AM
puri jagannadh  డబుల్ ఇస్మార్ట్ ముందు పూరి కి ఊరట
A relief to Puri Jagannadh before Double Ismart release డబుల్ ఇస్మార్ట్ ముందు పూరి కి ఊరట
Advertisement
Ads by CJ

లైగర్ నిరాశపరచడమ కాదు.. ఆ సినిమా వలన పూరి జగన్నాద్ దర్శకుడిగా, నిర్మాతగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అటు నష్టాలూ, ఇటు ఈడీ హడావిడి, ఎగ్జిబ్యూటర్స్ ధర్నాలు అన్నీ పూజ జగన్నాద్ ని ఇరకాటంలోకి నెట్టేశాయి. లైగర్ తర్వాత పూరి జగన్నాద్ కి అసలు హీరో దొరుకుతాడా అంటూ చాలా రకాలుగా కామెంట్స్ చేసారు. కానీ తనకి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పూరి చెంతకు హీరో రామ్ వచ్చి చేరాడు.

ఇస్మార్ట్ శంకర్ అంటూ పూరి-రామ్ కలిసి మోత మోగించిన విషయం తెలిసిందే. అదే లెక్కలో పూరి జగన్నాద్-రామ్ లు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని పూర్తి చేసి ఆగస్టు 15 న విడుదలకు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పాటలతో హోరెత్తిస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ లోను మంచి బజ్ క్రియేట్ అయ్యి ఉంది. 

దానికి తోడు ఈ సినిమా విడుదలకు ముందు పూరి జగన్నాద్ కి ఊరట లభించింది. అదేమంటే లైగర్ సినిమా ప్లాప్ అవడంతో ఆ సినిమాని కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయి.. తమకి నష్టాలు భర్తీ చెయ్యాలంటూ పూరి జగన్నాద్ ఇంటి ఎదుట ధర్నాలు గట్రా చేసి ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ లో పూరి పై కంప్లైంట్ కూడా ఇచ్చారు. తాజాగా లైగర్ నష్టాలకు సంబంధించి నైజం ఏరియా లో ఏ బయ్యర్ కి కూడా పూరి జగన్నాథ్ రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చేసింది ఫిలిం ఛాంబర్. 

దానితో పూరి జగన్నాద్ ఊపిరి పీల్చుకుంటున్నాడు. అసలే డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ముందు మళ్ళీ ఈగొడవ ఎక్కడ బయటికొస్తుందో అనే టెన్షన్ పూరి కి ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడు అది సద్దుమణగడంతో పూరి హ్యాపీగా డబుల్ ఇస్మార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చెయ్యడానికి హుషారుగా ప్రిపేర్ అవుతున్నాడు. 

A relief to Puri Jagannadh before Double Ismart release:

Liger losses: Puri Jagannadh gets a relief

Tags:   PURI JAGANNADH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ