మల్లువుడ్ భామ మాళవిక మోహనన్ కోలీవుడ్ లో క్రేజీ తారగా వెలుగొందడమే కాదు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ లో రొమాన్స్ చేస్తుంది. దానితో ఆమెను ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాదించేస్తున్నారు. ప్రభాస్ సినిమా విడుదలవ్వగానే మాళవిక మోహనన్ తెలుగులో స్టార్ హీరోల ఆఫర్స్ తో బిజీ అవ్వడం ఖాయమంటున్నారు.
ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా మాళవిక మోహనన్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ అందాలు ఆరబోసే ఫొటోస్ తో యూత్ ని తన చుట్టూ తిప్పుకుంటుంది. ఈసారి చీర కట్టు తో కుర్రకారు గుండెళ్లో డప్పు మోగించింది. అది కూడా రెడ్ శారీ లో మాళవిక అందాలు వర్ణించడానికి కవి దిగిరావాల్సిందే.
రెడ్ శారీ లో నడుమోంపులతో చంపేసింది, నాభి అందాలతో కవ్విస్తున్న మాళవిక మోహనన్ అందంకు యూత్ ఆమె చుట్టూ ప్రదక్షిణ చెయ్యాల్సిందే. మాళవికను అలా సూపర్బ్ గా రెడ్ శారీ లో చూడగానే మతిపోగొడుతున్న మాళవిక అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.