సూపర్ స్టార్ మహేష్-రాజమౌళి కలయికలోమొదలు కాబోయే మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళుతుందా అని మహేష్ అభిమానులతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల తర్వాత రాజమౌళి హాలివుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. అందుకే సూపర్ స్టార్ తో రాజమౌళి చెయ్యబోయే చిత్రం కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు.
ఆగష్టు 9 మహేష్ బర్త్ డే స్పెషల్ గా రాజమౌళి కాన్సెప్ట్ వీడియోతో మహేష్ మూవీపై క్లారిటీ ఇస్తారని, అలా మహేష్ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ రాబోతున్నట్లుగా ప్రచారం జరిగినా.. అది సెప్టెంబర్ వరకు వచ్చే అవకాశం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే విజయేంద్రప్రసాద్ స్క్రిప్టు పనులు పూర్తి చేశారు. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారు.
అయితే రాజమౌళి-మహేష్ మూవీ టైటిల్ విషయంలో రకరకాల న్యూస్ లు చక్కర్లు కొట్టినా తాజాగా ఈ మూవీ టైటిల్ గోల్డ్ అంటూ మరో న్యూస్ హైలెట్ అయ్యింది. ఈ టైటిల్ అన్ని భాషల వారికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని.. రాజమౌళి ఈ టైటిల్ ని పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ టైటిల్ విషయం ఎలా ఉన్నా రాజమౌళి మహేష్ కోసం ఓ స్టార్ హీరోని విలన్ గా తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. అది ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.