దర్శకుడు ప్రశాంత్ నీల్ కి లైన్ లో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ గత ఆరు నెలలుగా ఖాళీగానే ఉంటున్నారు. మే నుంచి సలార్ 2 పట్టాలెక్కుతోంది.. సలార్ 1 తో పాటు గానే సలార్ 2 షూటింగ్ చాలావరకు కంప్లీట్ అయ్యింది, పార్ట్ 2 ని త్వరగా చుట్టేసారని అన్నా అది ఇంతవరకు సెట్ కాలేదు.
మరోపక్క ఆగష్టు నుంచి ఎన్టీఆర్ తో మూవీ సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది. అంతేకాకుండా KGF సీరీస్ లో పార్ట్ 3 బాలన్స్ వుంది. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ తో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీ పట్టాలెక్కబోతుంది అనే వార్త ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఒక దర్శకుడు ముగ్గురు నాలుగురు హీరోలతో కమిట్మెంట్స్ పెట్టుకోవడం విచిత్రమేమి కాదు.
కానీ ప్రశాంత్ నీల్-అజిత్ అసలు ఇంతరకు మీటవ్వలేదు. కానీ అజిత్ తో ప్రశాంత్ నీల్ మూవీ అంటూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది కేవలం ఎవరో క్రియేట్ చేసిన వార్తే కానీ.. అజిత్-ప్రశాంత్ నీల్ మూవీ అనేది జస్ట్ రూమర్ అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు.