Advertisementt

బిగ్ బాస్ కి వెళ్ళను అంటున్న ఆంటీ

Thu 25th Jul 2024 05:08 PM
kumari aunty  బిగ్ బాస్ కి వెళ్ళను అంటున్న ఆంటీ
Aunty says she will not go to Bigg Boss బిగ్ బాస్ కి వెళ్ళను అంటున్న ఆంటీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 సూన్ అంటూ కింగ్ నాగార్జున బిగ్ బాస్ 8 లోగో ప్రోమో ని వదిలిన విషయం తెలిసిందే. ఆగష్టు చివరి వారం నుంచి మొదలుకాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి వీళ్ళేలుతున్నారు, వాళ్లేలుతున్నారు అంటూ సోషల్ మీడియాలో బోలెడన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.  

అందులో ముఖ్యంగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు అలాగే ఫుడ్ తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ పేర్లు వైరల్ గా మారాయి. వేణు స్వామి నాకు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చారు కానీ నేను వెళ్ళను, బిగ్ బాస్ నాకు నచ్చదని చెప్పేసాడు. ఇక కుమార్ ఆంటీ దగ్గరకు వెళ్లి మీరు బిగ్ బాస్ కి వెళుతున్నారంటగా అని అడిగితే.. వాళ్ళు రమ్మని అడిగిన మాట వాస్తవం కానీ.. నేను వెళ్ళను. 

నాకు నా బిజినెస్ ముఖ్యం, సాయంత్రం నాలుగు తర్వాత ఫ్రీ అవుతాను. ఆ తర్వాత ఎవరు ఏ షోకి పిలిచినా వెళుతున్నాను, బిగ్ బాస్ కి వెళితే నా బిజినెస్ పోతుంది. నా భర్తకు ఇన్నేళ్లుగా వంట దగ్గర ఉండి ఆరోగ్యం పాడైంది అని చెప్పింది. మీరు బిగ్ బాస్ కి పొతే బాగా ఫేమస్ అవుతారని అన్నప్పటికీ.. కుమార్ ఆంటీ మాత్రం వెళ్ళను అంటుంది. 

కానీ ఆమె బిగ్ బాస్ నిబంధలు దృష్ట్యా నిజం చెప్పడం లేదు. ఆమె బిగ్ బాస్ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు కొంతమంది జనాలు. 

Aunty says she will not go to Bigg Boss:

Kumari Aunty In Bigg Boss?

Tags:   KUMARI AUNTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ