రకుల్ ప్రీత్ కి పెళ్లయినా వన్నె తగ్గడం కాదు .. గ్లామర్ విషయంలో ఇంకా సదరు హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇస్తుంది అనేలా ఆమె లేటెస్ట్ ఫొటోస్ షూట్స్ ఉంటున్నాయి. సౌత్ లో అవకాశాలు లేవు, రావని తెలిసినా రకుల్ ఏమి నిరాశ పడడం లేదు. సోషల్ మీడియా లో ట్రెండీ ఫోటో షూట్స్ తో దర్శకనిర్మాతలకు వల విసురుతూనే ఉంటుంది.
ఇండియన్ 2 సక్సెస్ అయితే రకుల్ ఆశ తీరేది. కానీ ఆ సినిమా సౌత్ లోని అన్ని భాషల్లో నిరాశ పరచడంతో రకుల్ ప్రీత్ ఇకపై హిందీలోనే అవకాశాలు వెతుక్కోవాలేమో. హిందీ లోకి వెళ్ళాక రకుల్ ప్రీత్ సౌత్ ని లైట్ తీసుకోలేదు ఇక్కడ ఆమెకి పూర్తిగా ఆఫర్స్ తగ్గాయనే కారణంతోనే ఆమె ముంబై లో ఉండిపోయింది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ ని వదిలే రకుల్ ప్రీత్ తాజాగా శారీ పిక్స్ వదిలింది. చీర కట్టులో రకుల్ ప్రీత్ సోయగం చూస్తే ఆహా ఏమందం.. ఎందుకు ఈ అందాన్ని సౌత్ దర్శకులు పరిగణనలోకి తీసుకోవడం లేదో అని అనుకోక మానరు. మోడ్రెన్ దుస్తులు అయినా, ఇలాంటి ట్రెడిషనల్ లుక్ లో అయినా రకుల్ కి ఎవరూ సాటిరారు అనేలా ఆమె న్యూ లుక్ ఉంది. మీరు రకుల్ చీర కట్టు పై ఓ లుక్కెయ్యండి.