నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా ప్రవేశించి 50 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఓ పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. సౌత్ ఇండియా సెలబ్రిటీస్ ని పిలిచి గ్రాండ్ గా ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. సౌత్ సెలబ్రిటీస్ తో బాలయ్యని సత్కరించే ప్లాన్ లో ఉన్నారు.
ఈ ఈవెంట్ మరో వారం రోజుల్లో అంటే సెప్టెంబర్ 1న కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. మరి ఈ ఈవెంట్ కి బాలయ్యతో పని చేసిన దర్శక, నిర్మాతలతో పాటుగా, హీరోయిన్స్, అలాగే సౌత్ లో పలు భాషల నుంచి టాప్ స్టార్స్ హాజరవుతారని తెలుస్తోంది.
ఈ ఈవెంట్ కి ఎంతమంది వచ్చినా అందరికి మెగాస్టార్ చిరు వస్తారా, రారా అనే విషయంలోనే అనుమానం ఎక్కువగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో పెద్ద అనే పదంతో చిరుకి బాలయ్య కి మద్యన డిస్టెన్స్ పెరిగింది అనే వాదన ఉంది. అందుకే బాలయ్య 50 ఏళ్ళ సంబరానికి చిరు వస్తారా అనే విషయంలోనే అందరి డౌట్. చూద్దాం ఈ ఈవెంట్ కి మెగాస్టార్ హాజరవుతారా, లేదో అనేది.