మెగా ఫ్యామిలీ అక్కడ లండన్ లో క్లింకార తో కలిసి సమయాన్ని గడుపుతున్నారు. రామ్ చరణ్-ఉపాసనలు కూతురుని తీసుకుని ముందే లండన్ వెళ్లారు. తర్వాత మెగాస్టార్ చిరు తన భార్య సురేఖతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ చరణ్ ఫ్యామిలీతో కలిసి మనవరాలితో మెగా స్టార్ ఎంజాయ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరోపక్క అల్లు ఫ్యామిలీ కూడా వెకేషన్ లో మునిగి తెలుతోంది. పుష్ప ద రూల్ షూటింగ్ కాస్త గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ ఫ్యామిలీ అంటే భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయన్, అర్హ లను తీసుకుని వెకేషన్ కి వెళ్ళిపోయాడు. అక్కడ భార్య పిల్లలతో కలిసి ఐకాన్ స్టార్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. యూరప్ లోని నార్వే దేశంలో అల్లు ఫ్యామిలీ సందడి చేస్తుంది.
వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ప్రతి క్షణాన్ని స్నేహ రెడ్డి ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. నార్వే వెకేషన్ నుంచి స్నేహ ఇప్పటికే పలు ఫోటోలు, అక్కడి ప్రకృతి అందాలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో షేర్ చేసింది. తాజాగా స్నేహ భర్త అల్లు అర్జున్ ని కౌగలించుకొని దిగిన సెల్ఫీ షేర్ చేసింది. అల్లు అర్జున్ పుష్ప లుక్ లో ఫేస్ కనపడకుండా కౌగిలించుకొని ఉన్న ఫోటో స్నేహ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో వెనక అర్హ కూడా ఉంది.
అది చూసిన నెటిజెన్స్ అల్లు అర్జున్ ఫ్యామిలీ నార్వే లో ఎంజోయ్ చేస్తుంటే మెగా ఫ్యామిలీ మాత్రం లండన్ లో ఎంజాయ్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.