వైసీపీ ప్రభుత్వంలో హైలెట్ అవ్వడానికి అన్నా అంటూ జగన్ ని పొగుడుతూ ప్రతిపక్షాలను తిడుతూ మీడియాలో కనిపించిన రోజా ఓటమి తర్వాత రెండుమూడుసార్లు మాత్రం మీడియాకి దర్శనమిచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్యెల్యేగా గెలిచాక తన జబర్దస్త్, అలాగే బుల్లితెర ప్రోగ్రామ్స్ చేసుకున్న రోజా మినిస్టర్ అయ్యాక నిత్యం ప్రజల్లో ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేది. అంతేకాదు పర్యాటక శాఖామంత్రిగా గేమ్స్ ఆడుతూ మీడియా లో తెగ హడావిడి చేసేది.
కానీ 2024 ఎన్నికల్లో రోజా గెలుపు ధీమాకి ప్రజలు ఓట్లెయ్యకుండా నడ్డి విరిచారు. ప్రతిపక్షాలపై రెచ్చిపోయి మాట్లాడిన రోజా ఇప్పుడు కిమ్మనకుండా ఉండడమే కాదు.. అసలు అడ్రెస్స్ లేకుండా పోయింది. రెండుమూడు పెళ్లిళ్లలో కనిపించిన ఆమె ఇక మీడియా ముందుకు రావడం లేదు. యూనియన్ బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై రోజా మారు మాట్లాడకుండా కూర్చుంది.
వైసీపీ ప్రభుత్వ అండ చూసుకుని చిన్నదానికి పెద్దదానికి నోరేసుకుని పడిపోయిన రోజా కి ఇప్పుడు మాట పడిపోయిందా ఏమిటి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఓటమి శాశ్వతం కాదు, గెలుపోటములు ఉంటాయంటూ నీతులు చెప్పిన రోజా ఇలా కామ్ అవడం వెనుక కారణమేమిటా అని నగరి ప్రజలు కూడా తెగ ఆలోచించేస్తున్నారు.