మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర షూటింగ్ చుట్టేసే పనిలో బిజీగా వున్నాడు. దేవర లాస్ట్ షెడ్యూల్ తో పాటుగా, రెండు పాటల చిత్రీకరణ బాలన్స్ ఉన్నాయి. అవి పూర్తి కాగానే ఎన్టీఆర్ ఆగష్టు రెండో వారంలో ముంబై ఫ్లైట్ ఎక్కుతాడట. అక్కడ వార్ 2 షూటింగ్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ ముంబై వెళ్ళబోతున్నాడు.
అయితే ఎన్టీఆర్ ముంబై వెళితే ఇక్కడ ఆగస్టు లో మొదలు కావాల్సిన ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏమవుతుంది. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అంటూ మైత్రి మూవీస్ వారు ఎన్టీఆర్ బర్త్ డే రోజున ప్రకటించారు. సో దాని ప్రకారం ఆగస్టు లో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ వార్ 2 కు డేట్స్ ఇస్తే ఈప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచన.
అసలు ప్రశాంత్ నీల్ సలార్2 ని ఏం చేస్తారు, అది మే లో మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆగష్టు వచ్చేసింది. అసలు సలార్ 2 పై ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు మొదలు పెడతారో అనే విషయంలో మళ్ళీ కన్ఫ్యూజ్ మొదలయ్యింది.