బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రీసెంట్ గా ఆసుపత్రికి వెళ్లి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అవడంతో జాన్వీ కపూర్ ని ఆమె తండ్రి బోని కపూర్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. జాన్వీ కపూర్ తాను రీసెంట్ గా నటించిన హిందీ ఫిలిం ఉలజ్ చిత్రం ప్రమోషన్స్ పాల్గొంటుంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ హాస్పిటల్ లో చేరికపై రియాక్ట్ అయ్యింది.
తాను ఆసుపత్రిలో జాయిన్ అవడం అనేది మొదటిసారి అని.. సినిమా ప్రమోషన్స్, సినిమా షూటింగ్స్ తో బాగా అలిసిపోయాను. సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఫుడ్ తిన్నాను. ఫస్ట్ కడుపులో నెప్పిగా అనిపించింది. ఆ తర్వాత నీరసం వచ్చింది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కడానికి కూడా భయపడిపోయాను, వాష్ రూమ్ కి కూడా తోడు లేకుండా వెళ్ళలేకపోయాను.
ఆ తర్వాత హాస్పిటల్ లో చేరాక డాక్టర్స్ అన్ని టెస్ట్ లు చేసాక నా రిపోర్ట్స్ చూసి భయపడ్డారు. లివర్ కి చాలా ప్రోబ్లేం అయ్యింది. దానితో మూడు నాలుగు రోజులపాటు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. ఆ టైమ్ లో చాలా భయంగా అనిపించింది. హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు మళ్ళీ మాములుగా నేను డాన్స్ చేయగలనా, లేదా అని భయపడ్డాను. కానీ ఇప్పుడు నార్మల్ స్థితికి వచ్చేసాను అంటూ జాన్వీ హాస్పిటల్ చేరికపై తాజాగా స్పందించింది.