గత పదేళ్లుగా మిత్రులుగా కనిపించిన జగన్-కేసీఆర్ ఒకేసారి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాక కూడా తన మిత్రుడు జగన్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేసారు కేసిఆర్. కానీ మిత్రుడు జగన్ కూడా ఓడిపోవడం కెసిఆర్, కేటీఆర్ ఇద్దరికి షాకే. చంద్రబాబును జగన్ జైలు పాలు చేసినప్పుడు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ధర్నాలు అవి చేస్తే.. కేటీఆర్ మాత్రం మీ ఏపీకి పోయి చేసుకోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. అదే ఎఫెక్ట్ కెసిఆర్ తో పాటుగా ఇప్పుడు జగన్ కి కూడా తగిలింది అని టీడీపీ అభిమానులు మాట్లాడుతుంటారు.
అంత ఫ్రెండ్ షిప్ ఉన్న కెసిఆర్ జగన్ లు కూడా ఓటమి తర్వాత విడిపోయారా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. కారణం ఈరోజు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ధర్నా మొదలు పెట్టాడు. తనకి రాజకీయ పార్టీలు మద్దతు కావాలంటూ ఓపెన్ గానే అడిగాడు. జగన్ ధర్నాకు ఇండి కూటమిలో కాంగ్రెస్ తప్ప కీలకంగా ఉన్న ముఖ్య పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. అందులో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా పాల్గొన్నారు.
ఎంతమంది మద్దతునిచ్చినా కేసీఆర్ తన పార్టీ నుంచి జగన్ కి సపోర్ట్ గా ఎవరిని పంపించకపోవడం చూసి చాలామంది షాకవుతున్నారు. మరి జగన్-కెసిఆర్, కేటీఆర్ లు ఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వేళ జగన్ ధర్నాకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాకపోవటం చర్చకు కారణమవుతోంది. అందుకే జగన్-కెసిఆర్ కూడా విడిపోయారా అని ఇప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.