Advertisementt

లండన్ లో క్లింకారతో మెగా ఫ్యామిలీ

Wed 24th Jul 2024 07:21 PM
chiranjeevi  లండన్ లో క్లింకారతో మెగా ఫ్యామిలీ
Chiranjeevi Along With Ram Charan Enjoying In London లండన్ లో క్లింకారతో మెగా ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-ఉపాసన తన కుమార్తె క్లింకార తో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గానే అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు ముంబై వెళ్లిన రామ్ చరణ్ - ఉపాసన అటు నుంచి అటే లండన్ కి వెళ్లారు. అక్కడ రామ్ చరణ్ న్యూ మేకోవర్ తో పాటుగా భార్య కుమార్తె తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. 

అయితే రామ్ చరణ్ జంటకి ఇప్పుడు మెగాస్టార్ జంట కూడా తోడయ్యింది. కొడుకు అలాగే మనవరాలు క్లింకార తో కలిసి టైమ్ స్పెండ్ చెయ్యడానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ తో కలిసి లండన్ వెళ్లారు. చిరంజీవి.. భార్య సురేఖ, కొడుకు చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లింకార తో కలిసి నడుస్తున్న ఫోటో ని షేర్ చేస్తూ.. 

ఆ పిక్ కి క్యాప్షన్ గా.. రేపు పారిస్‌కు వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌లో ఫ్యామిలీ అండ్ మాగ్రాండ్ లిటిల్ వన్ క్లింకారతో అద్భుతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ.. సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ ఈవెంట్ బెకన్స్ అంటూ చిరు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈమధ్యనే క్లింకార పాప తన మొదటి పుట్టిన రోజువేడుకలను జరుపుకుంది. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తుంది. 

Chiranjeevi Along With Ram Charan Enjoying In London:

Mega Star and his family enjoying in London

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ