తానొకసారి పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ని రిజెక్ట్ చేసానని, దానితో ఆయన ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేసి నాకు ఇమేజ్ తెచ్చిపెట్టారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్ తో ఓ అదిరిపోయే సాంగ్ చేసారు. ఆ సాంగ్ బుల్లితెర స్టేజ్ పై ఓ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం పక్కా అంటూ అనసూయ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అయ్యాయి.
అయితే పవన్ కళ్యాణ్-అనసూయ భరద్వాజ్ లపై ఆ సాంగ్ కంపోజ్ చేసిన డాన్స్ మాస్టర్ గణేష్ మాట్లాడుతూ.. అది హరి హర వీరమల్లులో ఓ స్పెషల్ సాంగ్. అది ఎప్పుడో చిత్రీకరణ జరిగిపోయింది. మొత్తం 200 మంది డాన్సర్స్ తో చేసేసాం.. థియేటర్స్ లో ఆ పాట రాగానే దుమ్ము లేచిపోద్ది అంటూ గణేష్ మాస్టర్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరి హర వీరుమల్లు ఇప్పుడు మరొకరి చేతుల్లోకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్స్ లోకి రాగానే ముందుగా హరి హర వీరుమల్లు షూటింగ్ నే పూర్తి చేస్తారని తెలుస్తోంది. వీరమల్లు షూటింగ్ పూర్తి కాగానే ఆ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేస్తారు మేకర్స్.