చాలామంది హీరోయిన్స్ నాజూగ్గా గ్లామర్ గా ఉండేందుకు డైట్ చేస్తూనే దానికి తగ్గ వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ డైట్ లో భాగంగా ఇష్టమైన ఫుడ్ ని కూడా శాక్రిఫైజ్ చేస్తూ కడుపు మాడ్చుకుంటారు. హీరోయిన్స్ ని చూసి చాలామంది టీనేజ్ అమ్మాయిలు కూడా డైట్ డైట్ అంటూ కష్టతరమైన లైఫ్ స్టయిల్ లోకి వెళ్ళిపోతారు.
తాజాగా నయనతార తన డైట్ సీక్రెట్ ని, ఫిట్ నెస్ సీక్రెట్ ని రివీల్ చేసింది. 40 ప్లస్ వయసులోనూ నయనతార ఇప్పటికి ఫిట్ గా, అందంగా, నాజూగ్గా, గ్లామర్ గా కనిపిస్తూ కనువిందు చెయ్యడమే కాదు.. ఇప్పటికి టాప్ హీరోయిన్ ప్లేస్ లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ నటిగా నయనతారకి రికార్డ్ ఉంది.
అయితే తానింత అందంగా, ఫిట్ నెస్ తో ఉండడానికి కారణం చెప్పింది నయనతార. గతంలో డైట్ అంటే ఇష్టమైన ఫుడ్ తినకుండా ఉండడమే అనుకునేదాన్ని. కానీ అది కరెక్ట్ కాదని మా డాక్టర్ ద్వారా తెలుసుకున్నాను, అప్పటి నుంచి ఇష్టమైన ఫుడ్ ని, అలాగే శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని ఇంట్లోనే తయారు చేయించుకుని తింటున్నాను.
అలా కడుపు నిండా తినడం వలన జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక కలగడం లేదు. అలా తన ఆహార అలవాట్లు మారిపోయాయి, మన లైఫ్ స్టయిల్ ని బట్టే మన ఆరోగ్యం, జీవన విధానము ఉంటుంది అంటూ నయనతార తన ఫిట్ నెస్ సీక్రెట్ ని రివీల్ చేసింది.