కన్నడ పాన్ ఇండియా స్టార్ యశ్ KGF పార్ట్ 2 తర్వాత తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడానికి దాదాపుగా రెండేళ్ల సమయం తీసుకున్నాడు. యష్ పై అటు మీడియా, ఇటు ఫ్యాన్స్ ఎంతగా ఒత్తిడి చేసినా యష్ మాత్రం తొందరపడకుండా ఆచి తూచి సినిమాని మొదలు పెట్టాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు.
గోవా కేంద్రంగా జరిగిన డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ ఈ టాక్సిక్ తెరకెక్కుతుండగా.. ఇందులో ముందుగా కరీనా కపూర్ యష్ కి సిస్టర్ గా నటిస్తుంది అన్నప్పటికి ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో మరో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారని యష్ కి సిస్టర్ గా టాక్సిక్ మూవీకి తీసుకున్నారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి విలన్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ తో యష్ రొమాన్స్ చేయబోతున్నాడట.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లో యష్ బ్రేక్ కూడా తీసుకోకుండా పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో ఇండియన్ స్క్రీన్ మీద చూడని డార్క్ విజువల్స్ ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు యాక్షన్ ఎపిసోడ్స్ ని ఒళ్ళు జలదరించే రీతిలో ప్లాన్ చేశారని వినికిడి. ఈ సినిమా షూటింగ్ గోవాలో కొంత భాగం, విదేశాల్లో ఎక్కువశాతం చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.