కొద్దిరోజుల క్రితం నందమూరి వారసుడు మోక్షజ్ఞ న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఎల్లో కలర్ షర్ట్ లో మోక్షజ్ఞ హీరో లుక్స్ నందమూరి అభిమానులనే కాదు మూవీ లవర్స్ అందరిని ఆకట్టుకుంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞని ఎప్పుడెప్పుడు హీరోగా తెరంగేట్రం చేయిస్తారా అని నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్నారు.
ఇక మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తోది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వనున్నట్లుగా టాక్ నడుస్తుంది. అక్క తేజస్విని నిర్మాతగానే మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఉంటుంది అంటున్నారు. ఈలోపులో మోక్షజ్ఞ న్యూ మేకోవర్ వీడియోస్ సోషల్ మీడియాకి చేరింది.
అచ్చం స్టార్ హీరో మాదిరి స్టయిల్, ఆ యాటిట్యూడ్, ఆ ఆహార్యం, హ్యాండ్ సమ్ లుక్స్ అన్ని మోక్షజ్ఞ ని పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనేలా చూపిస్తున్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ మేకోవర్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అది చూసి నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.