Advertisementt

మెగా 157 పై క్రేజీ న్యూస్

Tue 23rd Jul 2024 05:34 PM
mega 157  మెగా 157 పై క్రేజీ న్యూస్
Crazy news on Mega 157 మెగా 157 పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్ పై మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అందరిలోనూ విపరీతమైన అంచనాలున్నాయి. మెగాస్టార్ ని గ్యాంగ్ లీడర్ మూవీలో చూసినట్టుగా ఉంది అంటూ విశ్వంభరలో మెగాస్టార్ లుక్ చూసిన వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష, ఆషిక రంగనాధ్ లు నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ తన కుమార్తె సుస్మిత నిర్మాతగా చెయ్యబోయే చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా #Mega157 పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా 157 కి కథ రెడీనే. కథతో మచ్చ రవి ఎప్పుడో మెగాస్టార్ ని ఇంప్రెస్స్ చేసాడు. కాని దర్శకుడెవరనేది మెగాస్టార్ నిన్నటివరకు ఆలోచనలోనే ఉన్నారు.

కానీ ఇప్పుడు మెగా 157 కి గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నై లో మెగా 157 స్క్రిప్ట్ తయారీ స్పీడ్ గా జరుగుతోంది అని, సుస్మిత నిర్మాతగా.. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ పై పూర్తి వివరాలు నెక్స్ట్ అప్ డేట్ లో.. !

Crazy news on Mega 157:

Mega 157 update 

Tags:   MEGA 157
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ