Advertisementt

ప్రభాస్ సరసన మృణాల్: అదృష్టం దక్కేనా?

Tue 23rd Jul 2024 04:56 PM
prabhas  ప్రభాస్ సరసన మృణాల్: అదృష్టం దక్కేనా?
Prabhas - Hanu Fauji To Have Mrunal Thakur ప్రభాస్ సరసన మృణాల్: అదృష్టం దక్కేనా?
Advertisement
Ads by CJ

సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన అవకాశం వచ్చింది అంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. హను రాఘవపూడి తనకి లక్కీగా మారిన మృణాల్ ఠాకూర్ ని ప్రభాస్ తో చెయ్యబోయే చిత్రం(ఫౌజీ వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్ గా తీసుకుంటున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా ప్రభాస్ సరసన శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ నటిస్తుంది అని, కాదు కాదు ఢిల్లీ కి చెందిన ఇమాన్ ఇస్మాయిల్ ప్రభాస్ కి పర్ఫెక్ట్ జోడి కాబోతుంది అని మరోసారి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరోపక్క పాకిస్థాన్ కు చెందిన మోడల్ సజల్ ఆలీ ని హను రాఘవపూడి ప్రభాస్ కోసం సంప్రదిస్తున్నారు అనే టాక్ మొదలైంది.

ప్రస్తుతం హను రాఘవపూడి స్క్రిప్ట్ వర్క్ పై ఉన్నాడని, ప్రభాస్ సెప్టెంబర్ నుంచి డేట్స్ ఇస్తే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ప్లాన్ లో హను ఉన్నాడని తెలుస్తోంది. ఈ పీరియాడిక్ డ్రామాని యాక్షన్ డ్రామాగా యుద్ద నేపథ్యంలో లవ్ స్టోరీ ని మిక్స్ చేసి హను రాఘవపూడి చూపించబోతున్నట్టుగా సమాచారం.

మరి ఈ చిత్రంలో ఫైనల్ గా ఏ హీరోయిన్ వస్తుందో తెలియదు కానీ.. అసలు ఏమి లేకుండానే మృణాల్ దగ్గర నుంచి ఢిల్లీ అమ్మాయి, పాకిస్తానీ గర్ల్ అంటూ ప్రభాస్ కి జోడిగా రకరాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూద్దాం మృణాల్ అదృష్టం ఎలా ఉందొ అనేది.!

Prabhas - Hanu Fauji To Have Mrunal Thakur:

Mrunal To Romance Prabhas

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ