Advertisementt

పుష్ప 2 ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Tue 23rd Jul 2024 01:41 PM
pushpa 2  పుష్ప 2 ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
Good news for Pushpa2 fans పుష్ప 2 ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ సెట్స్ లో ఏదో జరిగింది, దర్శకుడు, హీరో విడివిడిగా విదేశాలకు వెళ్లడం పై మీడియాలో మాములుగా చర్చ జరగలేదు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ లో గెడ్డం ట్రిమ్ చేయడంపై కూడా బోలెడన్ని డిస్కర్షన్స్ జరిగాయి. ప్రస్తుతం పుష్ప విషయంలో ఏం జరుగుతుందో అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

ఇవన్నీ పక్కనబెడితే ఈరోజు నుంచి పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది. అయితే పుష్ప 2 కి సంబందించి చాలా షూటింగ్ బాలన్స్ ఉంది.. సుకుమార్ దే మొత్తం భారం, డిసెంబర్ కి అయినా పుష్ప 2 వస్తుందా అనే ప్రచారానికి పుష్ప 2 టీం చెక్ పెట్టింది. ఆగష్టు చివరి వారానికల్లా పుష్ప ద రూల్ షూటింగ్ కంప్లీట్ చేసే దిశగా సుకుమార్ పరుగులు పెడుతున్నారట.

ఆగష్టు లో షూటింగ్ అవ్వగానే సెప్టెంబర్, అక్టోబర్ పోస్ట్ ప్రోడుక్షన్ కి కేటాయించి నవంబర్ మొత్తం పుష్ప 2 ప్రమోషన్స్ కోసం సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6 నే పుష్ప ద రూల్ ని విడుదల చెయ్యాలని మేకర్స్ గట్టిగా డిసైడ్ అయ్యారట. అల్లు అర్జున్ కూడా సుకుమార్ కి కోపరేట్ చేయడానికి సిద్దమయ్యాడని టాక్, మిగతా ఫహద్ ఫాసిల్, రష్మిక, కీలక నటుల డేట్స్ ని సుకుమార్ సెట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

సోషల్ మీడియాలో పుష్ప 2 పోస్ట్ పోన్ వార్తల నడుమ ఖచ్చితంగా డిసెంబర్ లో సినిమా విడుదలవుతుంది అనే భరోసా తో అల్లు ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు.  

Good news for Pushpa2 fans:

Pushpa The Rule Shooting update 

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ