గత రెండు రోజులుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన పారితోషికాన్ని తగ్గించుకుంటున్నారనే న్యూస్ విపరీతంగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడంటున్నారు. ప్రభాస్ పారితోషికం కరెక్ట్ గా లెక్కల్లో కట్టడం అనేది కష్టమే.
ప్రభాస్ పారితోషికం 100కోట్లు ఎప్పుడో దాటిపోయింది. కల్కి 2898 AD చిత్రానికి ప్రభాస్ 150 కోట్లు ఛార్జ్ చేసాడనే టాక్ ఉండనే ఉంది. 1000 కోట్ల హీరోగా మారిన ప్రభాస్ ఆ మాత్రం తీసుకోవడంలో తప్పులేదు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ఇప్పుడు పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయ్యారట.
ప్రభాస్ నిర్మాతల హీరో, బడ్జెట్ ని బట్టి పారితోషికం తీసుకునే హీరో. ఇప్పుడు రాజా సాబ్ కోసం ప్రభాస్ పారితోషికం తగ్గించబోతున్నారట. రాజా సాబ్ బడ్జెట్ తక్కువ మాత్రమే కాదు ప్రభాస్ పారితోషికం తగ్గించడానికి కారణం, ప్రభాస్ డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ ని ఈ రాజాసాబ్ నిర్మాణ సంస్థ రిలీజ్ చెయ్యడంతో భారీగా నష్టపోయింది.
అందుకే ప్రభాస్ అటు రాజాసాబ్ నిర్మాణ పరంగా, అలాగే నిర్మాతల ఆదిపురుష్ నష్టాలు భర్తీ అయ్యేలా తన పారితోషికాన్ని దాదాపు 250 కోట్లు తగ్గించుకుని 100 కోట్లు మాత్రమే అందుకుంటున్నారని టాక్.