కొద్దిరోజులుగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్ళబోతున్నాడనే ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతుంది. ఇంకేంటి వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి జాతకాలు చెప్పుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో వేణు స్వామిపై సెటైర్స్ మొదలయ్యాయి. అయితే అసలు వేణు స్వామినే మీరు బిగ్ బాస్ కి వెళుతున్నారా అని అడిగితే..
ఛీ బిగ్ బాస్ కా.. నేనా అంటూ బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. బిగ్ బాస్ అంటే అదొక చెత్త. దానికి వెళ్ళేవాళ్ళు ఓ ఏడాది పాటు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తారు. ఏడాది తిరిగి మరో సీజన్ మొదలయ్యే సరికి వాళ్ళు బిస్కెట్ అవుతారు. గత ఏడాది విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ కానివ్వండి ఎవ్వరైనా కానీ బిగ్ బాస్ వల్ల ప్రయోజనం వారు ఎవ్వరూ పొందలేదు.
నాకు బిగ్ బాస్ కి రమ్మని ఆఫర్ వచ్చింది. ఇప్పుడే కాదు గత ఏడాది కూడా నాకు బిగ్ బాస్ కి రమ్మని ఆఫర్ ఇచ్చారు. నేను బిగ్ బాస్ కి వ్యతిరేఖిని. అక్కడికెళ్లి నేనేం చేస్తాను అండి.. అయినా బిగ్ బాస్ కి వెళ్లి లైఫ్ నాశనం చేసుకోవద్దని అందరికి నేనే చెబుతాను. బిగ్ బాస్ కి వెళ్లోచ్చినోళ్ళు అమెరికా ఆట, తానా లలో స్పెషల్ షోస్ చేసుకుంటారు తప్ప ఆ బిగ్ బాస్ వలన వేరే ప్రయోజనం ఉండదు అంటూ వేణు స్వామి తాను బిగ్ బాస్ కి వెళ్లే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు.