యంగ్ ఎన్టీఆర్ దేవర చిత్రం తో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. ప్రస్తుత దేవర విడుదల కోసం చాలా ఎగ్జైట్ అవుతుంది. తంగం పాత్రలో జాలరి పేట అమ్మాయి లుక్ లో కనిపించబోతున్న జాన్వీ కపూర్ రోల్ పై అందరిలో చాలా ఆసక్తి ఉంది. ఈ బ్యూటీని డీ గ్లామర్ గా కొరటాల ఎలా చూపిస్తారో అని ఆమె అభిమానులు కూడా ఆత్రంగా కనబడుతున్నారు.
తాజాగా జాన్వీ కపూర్ తన తంగం రోల్ పై చిన్నపాటి క్లారిటీ ఇచ్చింది. సముద్రపు ఒడ్డున ఆడిపాడుతూ.. రొమాన్స్ చేస్తూ తన తంగం పాత్ర చాలా సరదాగా ఉంటుందని చెప్పిన జాన్వీ దేవర పార్ట్ 1లో, దేవర 2లోనే తన క్యారెక్టర్ ఎక్కువగా రివీలవుతుందని అసలు ట్విస్టు బయట పెట్టింది. దానితో పార్ట్ 1 లో జాన్వీ కపూర్ ఎక్కువగా పాటలకే పరిమితమవుతుందేమో అంటున్నారు నెటిజెన్స్.
ప్రస్తుతం రెండు పాట చిత్రకరణ, ఇంకాస్త ప్యాచ్ వర్క్ మాత్రమే దేవరకు బ్యాలెన్స్ వుంది. పాటల చిత్రీకరణ పూర్తయితే అంతా ఓ కొలిక్కి వచ్చేస్తుంది అని తెలుస్తోంది. ఇప్పటికే దేవర టైటిల్ ట్రాక్ వదలగా.. అది బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు రెండో సింగిల్ పై కాస్త సస్పెన్స్ నడుస్తుంది. అనిరుద్ వలన దేవర రెండో సాంగ్ కాస్త లేట్ అవుతుంది అనే టాక్ ఉంది.